Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (2024)

రంగా రాత్రి పూట ఇంటి పెరట్లో కూర్చుని ఆకాశంలో చంద్రుడ్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో మన హీరోయిన్ వసుధార వస్తుంది. రంగాతో పాటు ఈమె కూడా ఆకాశంలోని చంద్రుడ్ని చూడ్డం మొదలుపెడుతుంది. వసుధారని చూసిన రంగా.. ఆ చుక్కల లోకం నుంచి బయటకు వచ్చి.. ‘ఏంటి మేడమ్ గారూ ఇలా వచ్చారూ.. ఏదైనా మాట్లాడారు’ అని అడుగుతాడు. ‘ఏంలేదు’ అని వసుధార అనడంతో.. ‘ఏం లేనప్పుడు ఎందుకు మేడమ్.. ఈ చలిగాలిలో.. చక్కగా వెళ్లి పడుకోవచ్చు కదా’ అని అంటాడు. పడుకుందాం అనే అనుకున్నాను.. కానీ నిద్రపట్టడం లేదు.. మిమ్మల్ని చూసి మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది’ అని రంగా వైపు ప్రేమగా చూస్తుంది వసుధార. ఆ తరువాత ‘పిల్ల’గాలి వీస్తుండగా.. వసుధార వచ్చి రంగా పక్కన కూర్చుంటుంది. రంగా పక్కన కూర్చుని.. ‘రిషి సార్ కూడా ఇలాగే వెన్నెల్లో కూర్చునే వారు.. ఇలాగే చందమామని చూస్తూ తన ఫీలింగ్స్‌ని బయటపెట్టేవారు’ అంటూ తన ఫీలింగ్స్‌ని రంగా ముందుంచుతుంది వసుధార.

పొగరు అంటే.. మీ రిషి సార్‌నా??

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (1)

హమ్.. మీరు మళ్లీ మొదలెట్టేశారా? అని అంటాడు రంగా. ‘నేను ఏం చేసినా.. ఏం మాట్లాడినా మీ రిషి సార్‌నే తీసుకుని వస్తారు. మిమ్మల్ని పొగరు అంటే.. మా రిషి సార్ కూడా నన్ను ఇలాగే పొగరు అని అనేవారు.. నన్ను అలా అనే రైట్ ఆయనకి మాత్రమే ఉంది అని అన్నారు. ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చుని చంద్రుడ్ని చూస్తుంటే.. వెన్నెలా అంటున్నారు. మీ రిషి సార్‌తో పోల్చుతున్నారు. నేను ఏం చేసినా కూడా మీ రిషి సార్‌తో లింక్ పెడుతున్నారు. మా రిషి సార్ ఇలాగే తింటారు.. ఇలాగే పడుకుంటారు.. ఇలాగే బుజ్జగిస్తారని మీ రిషి సార్‌తోనే పోల్చుతున్నారు.

మీ మనసుకి అలా అనిపిస్తుందా??

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (2)

మీరు చెప్పిందే చెప్తుంటే.. నాకూ అలవాటు అయిపోతున్నాడు మీ రిషి సార్ అని అంటాడు రంగా. దాంతో వసుధార.. ‘ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది కరెక్ట్ కాదా.. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని అంటుంది. ఆ మాటతో రంగా.. ‘మీకు నేను రిషి సార్‌గా అనిపించడం మీ పొరపాటు.. మీ ఇష్టం.. మీ మనసుకి అలా అనిపిస్తే నేనేం చేయలేను. కానీ నా ముందు మాత్రం అలా మాట్లాడొద్దు.. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన గురించి ఇన్ని చెప్తున్నారు సరే.. ఆయన అసలు ఏం చేస్తుంటారు? అని అడుగుతాడు రంగా.

ఆకాశంలా ఉరిమినా మేఘంలా వర్షిస్తారు మా రిషి సార్..

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (3)

‘ఆయన చాలా చేస్తుంటారు సార్.. ఈ సొసైటీ కోసం ఎంతో చేశారు.. నా కోసం ఇంకెంతో చేశారు. ఎవరైనా బాధలో ఉంటే రిషి సార్ తట్టుకోలేరు. చీమకి కూడా హాని తలపెట్టరు. కోపం వచ్చి.. ఆకాశంలా ఉరిమినా కూడా.. మేఘంలా వర్షిస్తారు’ అని రిషి సార్ పాఠం అందుకుంటుంది వసుధార. దాంతో రంగా.. ‘హో.. మీ సార్ చాలామంచి వాళ్లన్నమాట.. మరి మీ కోసం ఏం చేశారు మీ రిషి సార్’ అని అంటాడు రంగా. ‘అబ్బో నా కోసమా.. ఆయన ఏం చేసినా నాకోసమే. నా కంట్లో చిన్న కన్నీటి చుక్క చూసినా ఆయన తల్లడిల్లేవారు. నాకు ఏమైనా అయితే ఆయన ప్రశాంతంగా ఉండలేరు. నీనంటే రిషి సార్‌కి అంత ఇష్టం.

నేను బతికి ఉన్నదే మీ కోసం సార్.. కానీ మీరు నేనెవరో తెలియదంటున్నారు

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (4)

నాకు కష్టం వచ్చిన ప్రతిసారి.. ఆయనే కాపాడారు. నేనే ఏం అడిగినా ఇస్తారు. నన్ను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా సార్‌ని ప్రేమించేలా చేశారు. మా ఇద్దరి మనసులు కలిశాయ్.. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకున్నాం. ఆ తరువాత మా జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అన్నింటిని ఎదురించి పోరాడాం. కానీ విధి మమ్మల్ని దూరం చేసింది. ఇప్పుడు తను ఎదురైనా కానీ కొత్త వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. నాతో ఇంత జీవితం పంచుకున్న రిషి సార్.. నేను ఎదురు పడినా పట్టించుకోవడం లేదు. నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారు. నేను బతికి ఉన్నదే ఆయన కోసం.

రిషి సార్ చనిపోయారనే నిజం.. నమ్మండి మేడమ్ గారూ..

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (5)

ప్రపంచం అంతా తాను చనిపోయారని అన్నారు. కానీ నేను నమ్మలేదు. అందర్నీ ఎదిరించాను. రిషి సార్ బతికే ఉన్నారని పోరాడాను. ఆఖరికి పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లు కూడా కనిపెట్టలేనివి నేను కనిపెట్టేశా.. రిషి సార్ చనిపోయినట్టు కన్ఫామ్ చేసేశారు. కానీ నేను నమ్మలేదు. నా రిషి సార్ బతికే ఉన్నారని చెప్పాను’ అని అంటుంది వసుధార. దాంతో రంగా.. ‘మేడమ్ మీరు మీ రిషి సార్‌పై ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నారు కానీ.. అందరూ నమ్మినట్టు రిషి సార్ చనిపోయినట్టు నమ్మొచ్చు కదా.. ఎందుకు నమ్మడం లేదు’ అని అంటాడు రంగా.

మీరు రిషి సార్ కలుసుకోవాలి మేడమ్ గారూ..

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (6)

ఆ మాటతో వసుధార.. ఏం చేస్తాను సార్.. నా రిషి సార్ బతికి నా ముందే ఉన్నా.. ఆయన బతికే ఉన్నారని చెప్పలేకపోతున్నాను.. అని అంటుంది వసుధార. ‘అయ్యో మేడమ్ గారూ.. మీరు అటు చేసీ ఇటు చేసీ.. మళ్లీ నా దగ్గరకే తీసుకొస్తున్నారు. మీ రిషి సార్ బతికి ఉంటే మిమ్మల్ని కలవాలని కోరుకుంటా. కానీ మీరు మాత్రం నాలో అతన్ని ఊహించుకోవద్దు.. నన్ను మీ రిషి సార్‌ని చేయొద్దు.. నేను వేరు ఆయన వేరు.. నా పేరు రంగా.. అతని పేరు రిషి.. అయినా మీరు చెప్పిన మాటల్ని బట్టి.. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు.. గొప్ప కుటుంబంలో పుట్టిన వారు. నేను ఆటోడ్రైవర్‌ని.

మీనోటితోనే చెప్పిస్తా.. నేనే రిషి సార్ అని..

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (7)

నా బతుకేదో నేను బతుకుతున్నా.. నాకూ ఆయనకి పోలిక లేదు.. నాకూ ఆయనకి ఏ సంబంధం లేదు. నన్ను మీ రిషి సార్‌తో పోల్చి ఆయన్ని తక్కువ చేయొద్దు అని అంటాడు రంగా. ఆ మాటతో వసుధార.. ‘నిద్రపోయే వాళ్లని లేపొచ్చు కానీ.. నిద్రపోతున్నట్టు నటించే వాళ్లని లేపలేం.. మీరు కూడా నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను నిజం బయటపెట్టలేకపోతున్నా. ఈరోజు కాకపోతే ఏదొక రోజు మీరే రిషి సార్‌ అని ఒప్పుకునేట్టు చేస్తా. మీ నోటితో మీరే నేనే రిషి సార్ అని ఒప్పుకునేట్టు చేస్తా’ అని అంటుంది వసుధార.

ఆ అమ్మవారి చెంతనే రిషిగా మారబోతున్న రంగా.. ఇదే ట్విస్టూ

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (8)

నేను ఇంత చెప్పినా మీరు ఇలాగే మాట్లాడితే నేనేం చేయలేను మేడమ్ గారూ.. వెళ్లి పడుకోండి.. గుడ్ నైట్ మేడమ్ గారూ అని అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు రంగా. దాంతో వసుధార.. మళ్లీ ఆకాశంలో చూడ్డం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో తెల్లారిపోతుంది. ఇక ఉదయాన్నే రంగా ఆటో తీస్తూ.. రత్నాకర్ గారు అమ్మవారి దగ్గరకు వెళ్లాలన్నారు.. ఎప్పుడో కనుక్కో అని బుజ్జితో అంటాడు. వచ్చే ఆదివారం రమన్నారన్నా అని అంటాడు బుజ్జి. సరే పదా అని బుజ్జిని తీసుకుని రంగా వెళ్తుండగా వసుధార వచ్చి.. ‘సార్ నాకో సాయం చేస్తారా? అని అడుగుతుంది. అమ్మవారి దగ్గరకు రంగా వెళ్తున్నాడంటే.. రిషిధారలు తరచుగా కలుసుకుని ఆ అమ్మవారి సన్నిధే అయ్యి ఉంటుంది. అక్కడే రంగా రిషిగా మారబోతున్నాడేమో చూడాలి మరి.

మీనోటితోనే చెప్పిస్తా.. నేనే రిషి సార్ అని..

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (9)

నా బతుకేదో నేను బతుకుతున్నా.. నాకూ ఆయనకి పోలిక లేదు.. నాకూ ఆయనకి ఏ సంబంధం లేదు. నన్ను మీ రిషి సార్‌తో పోల్చి ఆయన్ని తక్కువ చేయొద్దు అని అంటాడు రంగా. ఆ మాటతో వసుధార.. ‘నిద్రపోయే వాళ్లని లేపొచ్చు కానీ.. నిద్రపోతున్నట్టు నటించే వాళ్లని లేపలేం.. మీరు కూడా నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను నిజం బయటపెట్టలేకపోతున్నా. ఈరోజు కాకపోతే ఏదొక రోజు మీరే రిషి సార్‌ అని ఒప్పుకునేట్టు చేస్తా. మీ నోటితో మీరే నేనే రిషి సార్ అని ఒప్పుకునేట్టు చేస్తా’ అని అంటుంది వసుధార.

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (10)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’ (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Zonia Mosciski DO

Last Updated:

Views: 6109

Rating: 4 / 5 (71 voted)

Reviews: 86% of readers found this page helpful

Author information

Name: Zonia Mosciski DO

Birthday: 1996-05-16

Address: Suite 228 919 Deana Ford, Lake Meridithberg, NE 60017-4257

Phone: +2613987384138

Job: Chief Retail Officer

Hobby: Tai chi, Dowsing, Poi, Letterboxing, Watching movies, Video gaming, Singing

Introduction: My name is Zonia Mosciski DO, I am a enchanting, joyous, lovely, successful, hilarious, tender, outstanding person who loves writing and wants to share my knowledge and understanding with you.