Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (2024)

Table of Contents
నాకు నచ్చిన కలర్స్, డిజైన్స్ మీకు ఎలా తెలుసు.. హయ్యో మేడమ్ గారూ.. మీ బట్టల సైజ్ నాకెలా తెలిసిందంటే.. నాకు ఏదైనా పని ఇప్పించండి... ఉద్యోగం చేస్తా మేడమ్ గారూ.. మీకు పని చూసేశాను.. ‘ఏంటీ తెల్లారేసరికే’!! వసుధారకి పంతులమ్మ ఉద్యోగం చూసిన రంగా.. వాటే ట్విస్ట్ రంగా మాటలకు వసుధార భావోద్వేగం.. పాపం పిచ్చి మరదలు.. బావ కోసం తపన రంగాని రెప్పవేయకుండా చేసిన వసుధార.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ వసుధార మైకంలో రంగా.. ‘కడుపునిండిపోయింది మరదలా.. నీ ఉప్మా వద్దూ నువ్వూ వద్దు’ డ్రెస్ ఎలా ఉంది సార్.. అబ్బబ్బా సూపరూ సరోజని హేళనగా నవ్విన వసుధార.. ‘వీళ్లది మాత్రమే ప్రేమా? సరోజది ప్రేమకాదా? ఏంటో వీళ్ల వేషాలు References

వసుధారకి రంగా అప్పుచేసి మరీ బట్టలు కొని తీసుకుని రావడంతో రచ్చ రచ్చ చేసింది మరదలు సరోజ. ఇక ఇంటికి వెళ్లి తన తండ్రికి మనసులో చెప్తుంది. కూతుర్ని బాగా చూసుకోవడం అంటే ఆస్తి, డబ్బు కాదు నాన్నా.. కోరుకున్న వాడ్ని ఇవ్వడం కూడా అని అంటుంది. దాంతో ఆలోచనలో పడతాడు సరోజ తండ్రి సంజీవయ్య. ఇక ఈరోజు (జూలై 03) ప్రసారం కాబోయే 1117 ఎపిసోడ్‌లో ఏమైందంటే.. రంగా తనకి కేవలం నాలుగు జతల బట్టలు మాత్రమే ఉన్నాయని వసుధారతో చెప్పడంతో ఎమోషనల్ అవుతుంది వసుధార. గతంలో రిషి సూటూ బూటూ వేసుకుని ఎంత హుందాగా ఉండేవాడో తలుచుకుని బాధపడుతుంది. ఎలా ఉండేవారు ఎలా అయ్యారు సార్.. మీరు భూషణ్ ఫ్యామిలీకి వారసుడు.. డీబీఎస్టీ కాలేజ్ అధిపతి.. మీరు సూటు వేసుకుని రెండు జేబులో చేతులు పెట్టుకుని నడిచివస్తుంటే అలాగే చూడాలనిపించేది. మీ వాకింగ్ స్టైల్, యాటిట్యూడ్ చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది సార్’ అని అంటుంది వసుధార. ‘హో మీ కలలా అంత బాగా కనిపించేవాడినా’? థాంక్యూ మేడమ్ గారూ.. థాంక్యూ’ అని అంటాడు రంగా.

నాకు నచ్చిన కలర్స్, డిజైన్స్ మీకు ఎలా తెలుసు..

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (1)

కలలో కాదు సార్.. రియల్ లైఫ్‌లో మీరు అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటున్నారు? ఏం జరిగిందో.. దీని వెనుక కారణం ఏంటో అర్ధం కావడం లేదు అని అంటుంది వసుధార. దాంతో రంగా.. ‘మేడమ్ గారూ.. మీరు మళ్లీ మొదలుపెట్టొద్దు. నాకు వినే ఓపిక లేదు. చూస్తున్నారు కదా.. ఈరోజు మీరు షాపింగ్ అంటే వెళ్లాను.. మీకు నచ్చిన బట్టలు కొని తీసుకొచ్చాను కదా’ అని అంటాడు రంగా. ఆమాటతో వసుధార.. ‘సరే.. మీరు రిషి సార్ కాదంటున్నారు కదా.. మరి నాకు నచ్చిన కలర్స్, డిజైన్స్ మీకు ఎలా తెలుసు? సైజ్ కూడా అడగలేదు.

హయ్యో మేడమ్ గారూ.. మీ బట్టల సైజ్ నాకెలా తెలిసిందంటే..

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (2)

సరిగ్గా నాకు సరిపోయేవి.. నాకు నచ్చేవి.. మీరు మెచ్చేవే తీసుకొచ్చారంటే ఇంతకంటే ఏం కావాలి.. మీరు నా రిషి సార్ అని చెప్పడానికి అని అంటుంది వసుధార. ‘హలో మేడమ్ గారూ.. మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు.. మనకేమైనా వంద కలర్లు ఉంటాయా? ఓ పది రంగులో కదా ఇష్టపడతాం.. వాటిలో ఎక్కువగా అమ్మాయిలకు పింక్ కలర్ నచ్చుతుంది.. లేదంటే బ్లూ కలర్.. లేదంటే మరో కలర్.. ఇక డిజైన్ అంటే షాప్‌లో వాళ్లే చూపించారు. మీ సైజ్‌లు నాకెలా తెలిశాయంటే.. మా మరదలు బట్టలు మీకు సరిపోయాయి కదా.. వాటిని తీసుకుని వెళ్లాను’ అని కవర్ చేసేస్తాడు రంగా.

నాకు ఏదైనా పని ఇప్పించండి... ఉద్యోగం చేస్తా

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (3)

మొత్తానికి వసుధార.. నువ్వు నా రిషివే అంటుంది.. లేదు లేదు నేను రంగాని అని అంటాడు. వీళ్ల మధ్య ఈ సీన్ ఇలా సా..గుతూనే ఉంటుంది. మీరు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి ఫిటింగ్‌లు పెడుతున్నారా? అని రంగా అనడంతో.. అయితే నాకు ఏదైనా పనిచూడండి.. మీ డబ్బులు మీకు ఇస్తాను అని అంటుంది వసుధార. ‘ఏంటి మేడమ్ గారూ ఇదీ.. మీరు బాగా చదువుకున్న వాళ్లు.. చదువులేని నాకు పని అడిగితే నేనేం ఇప్పిస్తా’ అని అంటాడు రంగా. ‘లేదు సార్.. మీరు ఇప్పిస్తారు.. అది నాకు తెలుసు’ అని అంటుంది వసుధార. దాంతో రంగా.. ఈమెకి నేను పని ఇప్పించడం ఏంటి అని ఆలోచనలో పడతాడు.

మేడమ్ గారూ.. మీకు పని చూసేశాను.. ‘ఏంటీ తెల్లారేసరికే’!!

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (4)

ఇక తెల్లారేసరికి వసుధారకి ఉద్యోగం చూసేస్తాడు రంగా. వసుధార, రాధమ్మలు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. మా రంగా తెచ్చిన బట్టలు సరిపోయాయా? అని రాధామ్మ అడిగితే.. సూపర్ గా సరిపోయాయ్ అని అంటుంది వసుధార. ఇంతలో గుడ్ మార్నింగ్ మేడమ్ గారూ అంటూ వస్తాడు రంగా. ఇక వసుధార.. రంగా వైపు అలాగే చూస్తూ.. ‘ఎప్పుడూ లేనిది గుడ్ మార్నింగ్ చెప్తున్నారేంటి’ అని అనుకుంటుంది. ‘మీరు ఏదైనా పని చూడమన్నారు కదా.. నేను చూశాను’ అని అంటాడు. ‘అవునా థాంక్స్ సార్.. ఇంతకీ ఏం పని’? అని అడుగుతుంది వసుధార. నేను చెప్పడం కాదు.. మీరే గెస్ చేయండి అని అంటాడు రంగా.

వసుధారకి పంతులమ్మ ఉద్యోగం చూసిన రంగా.. వాటే ట్విస్ట్

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (5)

దాంతో వసుధార.. కాసేపు ఆలోచించి.. ‘ఏదైనా షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా చూశారా?’ అని తనకి సూటయ్యే పనిని ఊహిస్తుంది. ‘లేదు.. లేదు.. ఇక్కడ అంత పెద్ద షాపింగ్ మాల్స్ ఏం లేవు’ అని అంటాడు రంగా. ఇక కాసేపు అక్కడ చూశారా.. ఇక్కడ చూశారా.. సీన్‌ని సాగదీస్తారు. చివరికి నేను గెస్ చేయలేకపోతున్నాను.. మీరే చెప్పండి సార్ అని అంటుంది వసుధార. చెప్పరా.. ఏం పని చూశావ్ ఈ పిల్లకి అని అడుగుతుంది రాధమ్మ. ‘దాంతో రంగా.. ‘మేడమ్ గారిని చూస్తే బాగా చదువుకున్న వారిలా ఉన్నారు. అందుకే మేడమ్ గారికి చదువు చెప్పే ఉద్యోగం చూశాను’ అని అంటాడు రంగా. ఆ మాటతో వసుధార ముఖం వెలిగిపోతుంది. ఇతను ఖచ్చితంగా నా రిషి సారే అని అనుకుంటుంది.

రంగా మాటలకు వసుధార భావోద్వేగం..

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (6)

అవును మేడమ్ గారూ.. ఈ ఊరిలో స్కూల్‌లో టీచర్ లేక.. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.. మీరు చదువు చెప్తానంటే.. నేను హెడ్ మాస్టర్‌తో మాట్లాడతాను. చెప్పండి మేడమ్.. స్కూల్‌లో పిల్లలకి పాఠాలు చెప్పగలరా? అని అంటాడు. రంగా మాటలకు వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి. దాంతో రంగా.. ‘ఏంటి మేడమ్ గారూ.. మిమ్మల్ని తప్పుగా అంచనా వేశానా?? కొంపతీసి మీరు చదువుకోలేదా? మీకు చదువు చెప్పే అర్హత లేదా? అని అంటాడు. దాంతో వసుధార.. కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘లేదు సార్.. బాగానే చదువుకున్నాను.. నేను చదువు చెప్పగలను.. మీరు హెడ్ మాస్టర్‌ గారితోమాట్లాడండి’అని అంటుంది.

పాపం పిచ్చి మరదలు.. బావ కోసం తపన

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (7)

దాంతో రంగా.. మీరొకసారి.. నేనొక సారి వెళ్లడం ఎందుకు? మీరు రెడీ అయ్యి వస్తే.. ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు రంగా. దాంతో వసుధార.. సరేనని వెంటనే రెడీ అయ్యి వస్తానని లోపలికి వెళ్తుంది. రంగా ఆటో దగ్గర వసుధార మేడమ్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పిచ్చి మరదలు సరోజ.. ‘టిఫిన్ చేసేవా? బావా అని బాక్స్ పట్టుకుని వస్తుంది. ‘లేదే చేయలేదు.. బయటకు వెళ్లొచ్చిన తరువాత తింటానులే’ అని అంటాడు రంగా. ‘బయటకు వెళ్తే ఎప్పుడొస్తావో ఏంటో.. అప్పటివరకూ ఆకలితో ఉంటావా ఏంటీ.. రా ముందు తిను’ అని అంటుంది సరోజ.

రంగాని రెప్పవేయకుండా చేసిన వసుధార.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (8)

తినకతప్పదంటావా? అని రంగా అంటే.. తప్పదు బావా.. నేను ఈరోజు నీకిష్టమైన ఉప్మా పెసరట్టు, పల్లీ చట్నీ తెచ్చాను. నువ్వు ఓ పట్టు పట్టాల్సిందే అని అంటుంది. దాంతో రంగా.. చేతులు కడుక్కుని తినడానికి బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో మన వసుధార మేడమ్ టిప్ టాప్‌గా రెడీ అయ్యి వస్తుంది. మన రంగా కంట్లో పడుతుంది. ఇక మనోడు గుటకవేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. వసుధార కూడా రంగాని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇద్దరూ అలా ఒకర్నొకరు చూసుకుంటూ ఉంటారు. బ్యాగ్రౌండ్‌లో.. ‘నా కుడిభుజం మీద కడవా’ అంటూ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. వాళ్లిద్దరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ని సరోజ చూస్తుంటుంది.

వసుధార మైకంలో రంగా.. ‘కడుపునిండిపోయింది మరదలా.. నీ ఉప్మా వద్దూ నువ్వూ వద్దు’

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (9)

రంగా అలా చూస్తుంటే.. వసుధార తల దించుకుని తెగ సిగ్గుపడిపోతుంది. రంగా మాత్రం వసుధారని రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. బావా బావా అని పక్కన మరదలు పిలుస్తున్నా కూడా.. వసుధార మైకంలోనే ఉండిపోతాడు రంగా. సరోజా.. బావా అని గట్టిగా అరిసేసరికి అప్పుడు ఆ మైకం నుంచి బయటకు వస్తాడు రంగా. ‘పెసరెట్టు ఉప్మా చల్లారిపోతుంది.. తిను’ అని అంటుంది. దాంతో రంగా.. ‘నాకు ఇప్పుడు వద్దులే.. బయటకు వెళ్లే పని ఉందిలే’ అని అంటాడు. అదేంటి బావా తినడానికి చేయి కడుక్కున్నావ్ కదా అని అంటుంది సరోజ. దాంతో రంగా.. వసుధారని చూశాక కడపు నిండిపోయింది అన్నట్టుగా ఓ చూపు చూసి.. వచ్చాక తింటానులే అని అంటాడు.

డ్రెస్ ఎలా ఉంది సార్.. అబ్బబ్బా సూపరూ

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (10)

ఓ పక్క మరదలు అంత ప్రేమ చూపిస్తుంటే.. రంగా మాత్రం వసుధార కోసం తపించిపోతాడు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటే ప్రేమించుకోవచ్చు కానీ.. తనని ఇష్టపడుతున్న ఓ అమ్మాయి ఎమోషన్‌తో ఆడుకున్నట్టుగానే కనిపిస్తాడు రంగా. వచ్చాక తింటానని చెప్తున్నాను కదా.. ఆలస్యంగా వెళ్తే హెడ్ మాస్టర్ వెళ్లిపోతాడు అని అంటాడు రంగా. దాంతో వసుధార.. ‘హెడ్ మాస్టర్ వెళ్లిపోవడం ఏంటి? సరోజ అడిగేసరికి.. వసుధార పంతులమ్మ మ్యాటర్‌ని చెప్తాడు. ‘హో.. నువ్వు ఇంత కంగారు పడుతున్నది దీనికోసమా? అని అంటుంది సరోజ. అవును.. అని అంటాడు రంగా. ఇంతలో వసుధార వచ్చి.. డ్రెస్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది.

సరోజని హేళనగా నవ్విన వసుధార.. ‘వీళ్లది మాత్రమే ప్రేమా? సరోజది ప్రేమకాదా? ఏంటో వీళ్ల వేషాలు

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (11)

బాగానే ఉంది మేడమ్.. నేను తీసుకుని వచ్చాను కదా.. ముందు పదండి అని వసుధారని ఆటో ఎక్కించుకుంటాడు రంగా. పాపం సరోజ మాత్రం.. ఆకలితో ఏం వెళ్తావ్ తిను బావా అని అంటుంది. వద్దని చెప్తున్నాను కదా.. వినవేంటి? అని వసుధార ఎక్కించుకుని వెళ్లిపోతాడు. అయితే వసుధార వెళ్తూ.. వెళ్తూ.. సరోజ వైపు చూసి హేళనగా నవ్వుతుంది. సరోజ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వసుధార, రిషిలు తమ ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్న ప్రతిసారి ఒకర్ని బలిపశువుని చేస్తారు. గతంలో ఏంజెల్ ఎమోషన్స్‌తో కూడా ఇలాగే ఆడుకున్నారు. ఇప్పుడు సరోజ ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు. ‘రిషిధార’లది మాత్రమే ప్రేమ.. ఎదుటి వాళ్లది ప్రేమే కాదు.. వాళ్ల ఎమోషన్స్‌కి విలువేలేదన్నట్టుగా చూపిస్తుంటారు. మొత్తానికి రిషిధార ప్రేమ ఖాతాలో అప్పుడు ఏంజెల్ బలి.. ఇప్పుడు సరోజ బలి.

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (12)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu Today జూలై 03 ఎపిసోడ్: వసుధారని టీచర్‌ని చేసిన రంగా.. ‘రిషి ఈజ్ బ్యాక్’.. కన్ఫామ్ చేసేశాడు (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Trent Wehner

Last Updated:

Views: 6119

Rating: 4.6 / 5 (76 voted)

Reviews: 91% of readers found this page helpful

Author information

Name: Trent Wehner

Birthday: 1993-03-14

Address: 872 Kevin Squares, New Codyville, AK 01785-0416

Phone: +18698800304764

Job: Senior Farming Developer

Hobby: Paintball, Calligraphy, Hunting, Flying disc, Lapidary, Rafting, Inline skating

Introduction: My name is Trent Wehner, I am a talented, brainy, zealous, light, funny, gleaming, attractive person who loves writing and wants to share my knowledge and understanding with you.