Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (2024)

Table of Contents
‘నీ సోది భరించలేకే నీ రిషి సార్ పారిపోయి ఉంటాడు’.. ఏం చెప్పావయ్యా రంగా ఆయుధం బయటకు తీసిన వసుధార.. ప్రేమా లేదూ గీమా లేదూ.. తెలిసిన అమ్మాయి అంతే రంగా గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన ఆ వ్యక్తి.. వసుధారకి మైండ్ బ్లాక్ నేను రిషి సార్‌ని కాదని చెప్తున్నా కదా.. రంగా ఫైర్ నా కూతుర్ని చదివిస్తున్నది రంగానే.. వసుధారకి హింట్ దొరికేసింది రంగా నాకు చాలా ఏళ్లుగా తెలుసు కానీ.. రేయ్ దాన్ని పట్టుకోండ్రా.. మేడమ్ గారూ.. ఎక్కండి.. ఎక్కండి.. మేడమ్ గారి గురించి రౌడీలకు ఎందుకు చెప్పావ్.. రంగా సీరియస్ మేడమ్‌ గారికి హాని చేస్తూ ఊరుకోను.. రంగా వార్నింగ్ రిషి రంగాగా ఎందుకు మారాడో తెలుసుకుంటా.. ఐపాయ్ References

రంగానే రిషి అయితే పర్లేదు.. కానీ ఒక వేళ రంగా వేరూ రిషి వేరైతే వసుధార పరిస్థితి ఏంటి? రంగానే రిషి అని అనుకుంటున్న వసుధార.. అతని కోసం పరితపించిపోతుంది. రిషీ సార్.. రిషీ సార్ అంటూ ప్రేమను ఒలకబోసేస్తోంది. అప్పుడు రిషి వసుధార అయినా.. ఇప్పుడు రంగా వసుధార అయినా ఈ పాత్రల్ని చేసేది ఆ ఇద్దరే అయినా.. ‘రిషిధార’ల మధ్య లవ్ సీన్లు అంటే చూడ్డానికి ముచ్చట వేసేది. కానీ ఇప్పుడు వసుధార.. ప్రేమ కురిపిస్తుంటే ఆ ఎమోషన్ పండటం లేదు. నేటి ఎపిసోడ్‌లో ఏమైందంటే.. రంగా వద్దంటున్నా.. అతనితో బోండాం తాగిస్తుంటుంది వసుధార. తాగండి సార్.. తాగండి.. ఇందులో కాల్షియం ఉంటుంది.. ఐరన్ ఉంటుంది.. విటమిన్ సి.. విటమిన్ డి ఉంటుందని బొండంపై ప్రవచనం చెప్తుంటుంది వసుధార. ‘అవును మరి.. రంగా ఈ భూ ప్రపంచంపై పుట్టలేదు.. అంతరిక్షం నుంచి దిగాడు.. అతనికి బొండం అంటే ఏంటో తెలియదు.. గతంలో మొక్కజొన్న పొత్తులు, పానీపూరీ ఇలా ప్రతి దాని గురించి వసుధార ఎలాగైతే ప్రవచనం ఇచ్చేదో ఇప్పుడు కూడా సేమ్ సీన్. విటమిన్ సి.. విటమిన్ డి ఎందుకు పనికొస్తాయో తెలుసా సార్.. చాలా పోషకాలు ఈ కొబ్బరిబొండంలో ఉంటాయి సార్ అంటూ నాన్ స్టాప్‌గా వాగుతూనే ఉంటుంది వసుధార.

‘నీ సోది భరించలేకే నీ రిషి సార్ పారిపోయి ఉంటాడు’.. ఏం చెప్పావయ్యా రంగా

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (1)

దాంతో రంగా.. ‘అబ్బా ఈ కొబ్బరి బొండం గురించి నాకు చెప్పకండి.. సేమ్ మీ రిషి సార్ కూడా.. ఇలాగే అంటారు కదా.. మీ ప్రవర్తన చూసినా.. మీమాటలు చూసినా ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఆ రిషి సార్ ఎవరోకానీ మిమ్మల్ని భరించాడంటే అతనికి చేతులెత్తి దండం పెట్టొచ్చు. అతనికి అదృష్టం ఉంది కాబట్టే మీకు దూరం అయిపోయి ఉంటాడు.. మీరు పదే పదే ఈ సోది చెప్పి విసిగించి ఉంటాడు.. అందుకే ఈ సోది భరించలేకే పారిపోయి ఉంటాడు’ అంటూ వసుధార గాలి తీసేస్తాడు రంగా. అంటే అన్నాడూ కానీ.. వసుధార ప్రవర్తన చూస్తే అలాగే ఉంది మరి.

ఆయుధం బయటకు తీసిన వసుధార..

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (2)

రంగా మాటలకు తన ఆయుధం బయటకు తీస్తుంది వసుధార. ఆయుధం కత్తో గొడ్డలో కాదు.. కన్నీళ్లు. ఏడ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక రంగా ఓదార్పు స్టార్ట్ చేస్తాడు. ‘మేడమ్ గారూ.. మేడమ్ గారూ.. నేను సరదాగా అన్నాను.. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి’ అని అంటాడు. దాంతో వసుధార.. ‘నా రిషి సార్ కూడా ఇలాగే ఓదార్చేవారు’ అని అంటుంది. ఆ మాటతో రంగా.. ఎవరైనా ఏడుస్తుంటే ఓదార్చడం సహజం అండీ బాబూ.. ఎవరైనా అలాగే చేస్తారు. మీరు దాన్ని పట్టుకుని నన్ను మీ రిషి సార్ అని అనొద్దు ప్లీజ్’ అని అంటాడు రంగా.

ప్రేమా లేదూ గీమా లేదూ.. తెలిసిన అమ్మాయి అంతే

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (3)

ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. ‘ఏరా రంగా.. ఎవరు ఈ అమ్మాయి.. కొంపతీసి ప్రేమిస్తున్నావా ఏంటీ’ అని అడుగుతాడు. ఆ మాట వినగానే.. వసుధార మనసులో గంటలు టింగ్ టింగ్ మని మోగుతాయి. బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. రంగా అయితే.. ‘తెలిసిన అమ్మాయి అంతే.. ప్రేమ లేదూ ఏమీ లేదు’ అని అంటాడు. దాంతో వసుధార బుంగమూతి పెడుతుంది. ఫోన్ వస్తే.. మాట్లాడుతూ పక్కకి వెళ్లిపోతాడు రంగా. దాంతో ఆ వ్యక్తి వసుధారతో.. మా రంగా నీకు ఎలా తెలుసమ్మా అని అడుగుతాడు. నాకెలా తెలుసో పక్కనపెట్టండి.. అతను మీకు ఎంతకాలంగా తెలుసు? అని అడుగుతుంది.

రంగా గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన ఆ వ్యక్తి.. వసుధారకి మైండ్ బ్లాక్

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (4)

దాంతో ఆ వ్యక్తి దిమ్మతిరిగే విషయాన్ని చెప్తాడు. ‘రంగా ఎప్పుడు తెలియడం ఏంటమ్మా.. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు.. వాడంటే ఊర్లోవాళ్లందరికీ చాలా ఇష్టం. వాడు కోప్పడతాడు కానీ.. చాలామంచివాడు. ఎవరికైనా కష్టం వస్తే.. అండగా ఉంటాడు. ధైర్యం చెప్తాడు.. చిటికెలా వాళ్ల కష్టం తీర్చుతాడు. ఇలాంటి వాడు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదా? అనిపిస్తుంది. డబ్బు ఉన్నా లేకున్నా వాడున్న చోట సంతోషం ఉంటుందమ్మా.. వాడ్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు’ అంటూ రంగాని తెగ పొగిడేస్తుంటాడు ఆ వ్యక్తి.

నేను రిషి సార్‌ని కాదని చెప్తున్నా కదా.. రంగా ఫైర్

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (5)

ఇంతలో రంగా వచ్చి.. ‘ఏంటన్నో.. ఏదో చెప్తున్నావ్’ అని అంటాడు. ఏం లేదురా.. ఈ అమ్మాయి నీ గురించి అడుగుతుంటే చెప్తున్నాలే.. అని అంటాడు. దాంతో రంగా.. ‘ఏంటి మేడమ్ ఇదీ.. నేను మీ రిషి సార్‌ని కాదని చెప్తున్నా కూడా.. నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారేంటి?? అని అడుగుతాడు. ‘లేదు సార్ మీరు నా రిషి సారే’ అని అంటుంది వసుధార. ‘నేను కాదని చెప్తుంటే వినరేంటి? మీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. మీరు నడుచుకుంటూ ఇంటికి రండి.. దారిలో కనిపించిన అందర్నీ ఎంక్వైరీ చేయండి.. అప్పుడైనా మీకు నిజం తెలుస్తుందేమో.. నేను నీ రిషిని కాదు రంగాని’ అని అంటూ ఆటో తీసుకుని వెళ్లిపోతాడు రంగా.

నా కూతుర్ని చదివిస్తున్నది రంగానే.. వసుధారకి హింట్ దొరికేసింది

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (6)

ఇంతలో మరొక ఆమె వచ్చి.. ‘ఏంటమ్మా మా రంగా వదిలేసి వెళ్లపోతున్నాడు? ఏమైంది? అని అడుగుతుంది. ‘మీకు రంగా తెలుసా? అని వసుధార అడగడంతో.. ‘రంగా తెలియకుండా ఉంటుందా? ఈ ఊరిలో ఎవర్ని అడిగినా మా రంగా గురించి చెప్తారు. చాలా మంచోడు.. బాబు బంగారం. నా కూతుర్ని నా తాగుబోతు భర్త పనికి పంపిస్తుంటే.. రంగా బాబు నా భర్తకి బుద్ది చెప్పి. నా కూతుర్ని చదివిస్తున్నాడు. అదేంటో తెలియదు కానీ.. రంగాకి చదువు అన్నా.. చదువుకునే పిల్లలు అన్నా రంగా బాబుకి చాలా ఇష్టం. నాకు తెలిసీ.. తను అంతగా చదువుకోకపోవడం వల్లేనేమో.

రంగా నాకు చాలా ఏళ్లుగా తెలుసు కానీ..

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (7)

రంగా లాంటి గుణవంతుడ్ని ఇప్పటివరకూ చూడలేదు.ఇంతకీ నువ్వు ఎవరు? ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావ్.. అని వసుధారని అడుగుతుంది ఆ మహిళ. దాంతో వసుధార.. ‘వాళ్ల ఇంట్లోకి వచ్చిన గెస్ట్‌ని’ అని అంటుంది. ‘అవునా.. రాధమ్మకి రంగా బాబు అంటే ప్రాణం’ అని అంటుంది ఆ మహిళ. ‘సరే రంగా మీకు ఎన్నాళ్లుగా తెలుసు’? అని అడుగుతుంది వసుధార. ‘నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి తెలుసు.. చాలా ఏళ్లు అవుతుంది. నిన్ను చూస్తుంటే ఏదో కష్టంలో ఉన్నావని తెలుస్తుంది. నీకు ఏదైనా కష్టం ఉంటే రంగాకి చెప్పు.. వెంటనే తీరుస్తాడు’ అని అంటుంది ఆ మహిళ. దాంతో వసుధార.. ‘మీ పేరు మాత్రమే మారింది సార్.. మీరు చేసే పనులు మారలేదు. మీరే రిషి సార్’ అని ఫిక్స్ అయిపోతుంది వసుధార.

రేయ్ దాన్ని పట్టుకోండ్రా..

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (8)

ఇక సరోజ.. పాండుతో పాటు రౌడీ గ్యాంగ్‌ని వెంటపెట్టుకుని వసుధార దగ్గరకు వస్తుంది. ఇదే కరెక్ట్ టైం.. బాక కూడా దీని పక్కన లేడు.. దీన్ని ఎవరూ కాపాడలేరు.. దాన్ని వీళ్లకి పట్టించేస్తా.. అదిగో మీకు కావాల్సిన అమ్మాయి.. తీసుకునిపోండి’ అని వసుధారని పాండుగాడికి అప్పగిస్తుంది. ఇక వసుధార ఒంటరిగా నడిచి వెళ్తుండగా.. రౌడీ గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేయడానికి వెంబడిస్తుంటారు. వాళ్లు దగ్గరకు వచ్చేయడంతో.. వసుధార వాళ్లని చూసి పారిపోతుంటుంది. సరిగ్గా వసుధారని రౌడీలుపట్టుకునే టైంకి రిషి ఆటో వేసుకుని వస్తాడు.

మేడమ్ గారూ.. ఎక్కండి.. ఎక్కండి..

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (9)

మేడమ్ గారూ ఆటో ఎక్కండీ అని వసుధారని ఆటోలో ఎక్కించుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక రౌడీలు ఆటోని పట్టుకోవడానికి పరుగుతీస్తారు కానీ.. రంగా, వసుధారలు తప్పించుకుంటారు. ఇక ఆటో ఎక్కిన తరువాత వసుధార మళ్లీ స్టార్ట్ చేస్తుంది. ‘రిషీ సార్.. కోపం వచ్చినప్పుడు దారిలో దింపేయడం.. ఆపద వచ్చినప్పుడు కాపాడటం.. మా రిషి సార్ చేసే పని.. మీరు ఖచ్చితంగా మా రిషి సారే’ అని మరొకసారి ఫిక్స్ అయిపోతుంది వసుధార. ఇక సరోజ అయితే.. ఈరోజుతో దరిద్రం పోయింది. ఆ వసుధారని రౌడీలు ఎత్తుకునిపోతారు’ అని సంబరపడిపోతూ ఉంటుంది.

మేడమ్ గారి గురించి రౌడీలకు ఎందుకు చెప్పావ్.. రంగా సీరియస్

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (10)

ఇంతలో రంగా.. వసుధారని తీసుకుని రావడంతో షాక్ అవుతుంది. రంగా వచ్చీ రాగానే.. సరోజపై మండిపడతాడు. ‘ఎందుకే మేడమ్ గారి గురించి ఆ రౌడీలకు చెప్పావ్’ అని నిలదీస్తాడు. ‘నేనేం చెప్పలేదు బావా’ అని అంటుంది సరోజ. ‘లేదు నువ్వు చెప్పావ్.. నువ్వు చెప్పండి నేను చూశాను.. నీకు అసలు మతి ఉండే ఈ పని చేశావా? నీకు అసలు బుద్ది ఉందా? మేడమ్ గారు.. మన ఇంట్లో ఉంటున్నారు.. ఆమెకి ఏదైనా జరిగితే మనదే బాధ్యత.. బుద్దిలేకుండా ప్రవర్తించకు’ అని ఫైర్ అవుతాడు రంగా. దాంతో సరోజ.. ‘ఏంటి బావా? తన కోసం నన్ను తిడుతున్నావ్ ఏంటి? నా భయం నాకు ఉంటుంది కదా’ అని అంటుంది.

మేడమ్‌ గారికి హాని చేస్తూ ఊరుకోను.. రంగా వార్నింగ్

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (11)

ఏంటే నీ భయం..? మండిపడతాడు రంగా. ‘నీ మనసులో లేనిపోని అనుమానాలు పెట్టుకోకు.. నీకు సాయం చేయాలనిపిస్తే చెయ్.. తనకి తోడుగా ఉండు.. అంతే తప్ప తనపై అసూయ పెంచుకోకు.. ఇలాంటి పనులు చేయకు. మేడమ్ గారి విషయంలో ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే నేను చూస్తూ ఊరుకోను’ అని సరోజకి వార్నింగ్ ఇస్తాడు రంగా. ఇక రాధమ్మ కూడా.. రంగాకి వంతపాడి.. సరోజకి క్లాస్ పీకుతుంది. నీ మనవరాలికి అలా గడ్డిపెట్టు అని ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లపోతాడు రంగా. దాంతో రాధమ్మ వసుధారతో.. ‘ఆ రౌడీలు నిన్ను ఎందుకు వెతుకుతున్నారు? నీ సమస్య ఏంటో మాకు తెలియదు కానీ.. నీ సమస్య తీరాకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్లాలి.. అంత వరకూ నువ్వు ఇక్కడే ఉండు’ అని అంటుంది.

రిషి రంగాగా ఎందుకు మారాడో తెలుసుకుంటా.. ఐపాయ్

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (12)

అసలు ఆమె సమస్య తీరడానికి ఆ ఇంట్లో ఉండటానికి అసలు కనెక్షనే లేదు కానీ.. వసుధార.. మళ్లీ మొదలుపెడుతుంది. ‘రిషీ సార్.. మీరు రంగా కాదు సార్.. ఖచ్చితంగా రిషి సారే.. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అతి తొందరలోనే తెలుసుకోవాలి? తెలుసుకుంటాను.. అని అంటుంది వసుధార. వామ్మో వసుధార తెలుసుకోవడం అంటే ఆ కథ కంచికి వెళ్లినట్టే. రిషిని మూడు నెలల్లో తీసుకొస్తానని మంగమ్మ శపథాలు చేసింది.. ఆ తరువాత మను తండ్రి ఎవరో కనుక్కుంటా.. వాడి తాత ఎవరో కనుక్కుంటా అని శపథాలు చేసింది.. అవీ పక్కకిపోయాయ్. ఇప్పుడు రిషి రంగాగా ఎందుకు మారాడో తెలుసుకుంటానంటూ కొత్త తెలుసుకోవడం స్టార్ట్ చేసిందన్నమాట. అంతేకాదు 15 రోజుల్లో రంగానే రిషి అని నిరూపిస్తానని సరోజతో సవాల్ చేసింది. ఇక రంగానే రిషి అని గుర్తుపట్టేశాడు పాండు. ఆ వివరాలు ఈ కింది లింక్‌లో చూడొచ్చు. Read Also: రేయ్ వాడేరా ఈ కథకి హీరో రిషేంద్ర భూషణ్.. రంగానే రిషి.. పాండు గుర్తుపట్టేశాడు Read Also: ‘గుప్పెడంత మనసు’ జూన్ 25 ఎపిసోడ్: శౌర్య నా బాధ్యత దీపా.. దేవుడిలా వచ్చిన కార్తీక్ Read Also: ‘బ్రహ్మముడి’ జూన్ 25 ఎపిసోడ్: శోభనం గదిలో కావ్యకు తన మనసులో మాట చెప్పిన రాజ్.. ‘నాకు నువ్వు కావాలి కళావతీ.. ఐ లవ్యూ’!

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (13)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu Today జూన్ 25 ఎపిసోడ్: రిషి.. రంగాగా ఎందుకు మారాడు.. వసుధారికి దిమ్మతిరిగే ట్విస్ట్ (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Terrell Hackett

Last Updated:

Views: 6111

Rating: 4.1 / 5 (72 voted)

Reviews: 87% of readers found this page helpful

Author information

Name: Terrell Hackett

Birthday: 1992-03-17

Address: Suite 453 459 Gibson Squares, East Adriane, AK 71925-5692

Phone: +21811810803470

Job: Chief Representative

Hobby: Board games, Rock climbing, Ghost hunting, Origami, Kabaddi, Mushroom hunting, Gaming

Introduction: My name is Terrell Hackett, I am a gleaming, brainy, courageous, helpful, healthy, cooperative, graceful person who loves writing and wants to share my knowledge and understanding with you.